ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు నిన్న నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోలేదంటూ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ ఫోన్ చేయడంతో నిన్న జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడింది.