నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది. ‘అఖండ’ చిత్రం సాధించిన భారీ విజయం తర్వాత, ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.