KMM: మధిర క్యాంపు కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చుకుని బ్రిటిష్ వారిపై పోరాడి దేశానికి స్వాత్రంత్యం తీసుకువచ్చారని పేర్కొన్నారు. యువత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.