WGL: ఓరుగల్లు భద్రకాళి శరన్నవరాత్రి వేడుకలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. నిజరూప దర్శనంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. దసరా పురస్కరించుకుని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సాయంత్రం కరీమాబాద్ లీలా మైదానంలో రావణవధ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నాట్లు నిర్వాహకులు తెలిపారు.