Ram Charan: రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు కీలక నిర్ణయం?
ఉప్పెన సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు.. సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. మెగా పవర్ స్టార్‌తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు. అయితే.. ఈ సినిమా కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు చేసుకొని.. చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. జూన్ నుంచి ఆర్సీ 16 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా కోసం బుచ్చిబాబు రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు దానికి బదులు.. సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకోవడానికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
బుచ్చిబాబుకి ఈ సినిమాపై చాలా నమ్మకం ఉందని.. అందుకే రెమ్యునరేషన్ వదులుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అయితే.. ఒక్క బుచ్చిబాబు అని కాదు గానీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు. కాబట్టి.. బుచ్చిబాబు కూడా ఇలాగే చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తూ ఉండగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా.. వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్నారు. ఆర్సీ 16 కోసం రామ్ చరణ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందని ప్రచారంలో ఉంది. మరి బుచ్చిబాబు, చరణ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.