Pawan Kalyan: OG విలన్‌గా యంగ్ హీరో.. మామూలుగా ఉండదు మరి!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న నాలుగు సినిమాల్లో 'ఓజి' హైప్ వేరే లెవల్లో ఉంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పరుగులు పెట్టిస్తోంది. అనౌన్స్మెంట్ నుంచే కిక్ ఇచ్చే అప్డేట్స్ ఇస్తూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు హైప్ ఎక్కిస్తున్నారు. తాజాగా ఓజి విలన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కొన్ని కీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. పవన్ టార్గెట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ వరకు కంప్లీట్ చేయనున్నారు. దీంతో జూలై 28న రిలీజ్ కానున్న ‘బ్రో’ మూవీ తర్వాత.. పవన్ నుంచి థియేటర్లోకి వచ్చేది ‘ఓజీ’నే అంటున్నారు. అదే జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు (Pawan Kalyan) పూనకాలే. ఇక ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్లో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతోంది. పవర్ స్టార్ కెరీర్లోనే ఈ ప్రాజెక్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పవర్ స్టార్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లుక్ ఓ రేంజ్లో ఉంది.
అలాంటి ఓజిని ఢీ కొట్టాలంటే.. ఆ రేంజ్ విలన్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఓజీ విలన్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఓ బాలీవుడ్ స్టార్ హీరోని విలన్‌గా తీసుకునేందుకు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరు? ఏంటి? అనేది తెలియకపోయినా.. బజ్ ప్రకారం మాత్రం.. టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ముగ్గురిలో ఎవరు ఓకే అయినా ఓజీ మామూలుగా ఉండదు. పవర్ స్టార్ (Pawan Kalyan) లాంటి స్టైలిష్ కటౌట్‌కి ఈ బాలీవుడ్ హీరోలు విలన్‌గా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతారు. మరి ఓజి విలన్‌గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.