RT4GM ఆగిపోయిందా? రవితేజ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో!?
ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. నాలుగో సారి గోపిచంద్ మలినేనితో చేయనున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. రవితేజ ప్లేస్‌లో బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనేది వైరల్‌గా మారింది.
డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత నాలుగోసారి కలిశారు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని, మాస్ మహారాజా రవితేజ. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. పైగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన గోపించద్ మలినేని.. ఇదే జోష్‌లో రవితేజకు మరో క్రాక్ లాంటి హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే RT4GM వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల.. మైత్రీమూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు గానీ.. ఇప్పుడు ఈ సినిమాను మరో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ్ లేదా హిందీ హీరో కోసం ట్రై చేస్తున్నారట. కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో మైత్రీ మూవీస్ వారు ప్లాన్ చేస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. గతంలోనే మైత్రీ మూవీస్‌లో సల్మాన్ ఖాన్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే సల్మాన్‌తో సినిమా అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిందే. అలాంటప్పుడు.. ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్నవన్నీ పుకార్లేనని అంటున్నారు కొందరు. ఎందుకంటే, మరో వెర్షన్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ కథకు సంబంధించి స్క్రిప్ట్వర్క్తో బిజీగా ఉన్నాడట మలినేని గోపీచంద్. కాబట్టి.. అసలు క్రాక్ కాంబో విషయంలో ఏం జరుగుతుందనే క్లారిటీ రావాల్సి ఉంది.