‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి భారీ పాన్ ఇండియాన్ పీరియాడికల్ ఫిల్మ్ రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు(Harihara Veeramallu)’ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే రాజకియాల కారణంగా.. పవన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి కంప్లీట్ చేయలేకపోతున్నారు.
కానీ ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు విలన్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. అందుకోసం కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా అర్జున్ రామ్‌పాల్‌ను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు బాబీ డియోల్‌ను సంప్రదించాడట క్రిష్. ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడట బాబీ డియోల్. అతి త్వరలో షూటింగ్ జాయిన్ అవనున్నారని టాక్. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉందంటున్నారు. ఇకపోతే పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లో హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.