ప్రముఖ నటి, బిగ్ బాస్(Big Boss) ఫేమ్ పూజా రామచంద్రన్(Pooja Ramachandran) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శనివారం పూజా రామచంద్రన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త, ప్రముఖ నటుడు జాన్ కొక్కెన్(John kokken) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను తండ్రినయ్యానంటూ ఆనందకర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన కుమారుడికి కియాన్ కొక్కెన్ అనే పేరును కూడా పెడుతున్నట్లు ప్రకటించాడు.
తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో పూజ-జాన్ దంపతులకు పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. పూజా రామచంద్రన్(Pooja Ramachandran) టాలీవుడ్(Tollywood) హీరో నిఖిల్ తో కలిసి ‘స్వామిరారా’ మూవీలో నటించారు. హీరో ఫ్రెండ్ గా అందర్నీ బురిడీ కొట్టించడంలో, తెలివితేటలు ప్రదర్శించడంతో మంచి నటనను కనబర్చింది. దీంతో ఆమె క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది.
కర్లీ హెయిర్ తో క్యూట్‌గా, అందం, నటనతో కుర్రాళ్ల హృదయాల్లో పూజా రామచంద్రన్(Pooja Ramachandran) స్థానం పొందారు. ఆమె కాంచన2, దోచేయ్, త్రిపుర, దళం, ఇంతలో ఎన్నెన్ని వింతలో, కృష్ణార్జున యుద్ధం, వెంకీమామ, ఎంత మంచివాడవురా, అంధకారం వంటి సినిమాల్లో ఆమె నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్2(Big Boss2)లో వైల్ట్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజులు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఆమె భర్త జాన్ కొక్కెన్ కూడా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ విలన్ గా నటించారు. కేజీఎఫ్ సిరీస్ లో కూడా నటించారు. అజిత్ తెగింపు, కబ్జా, వీరసింహారెడ్డి సినిమాల్లో మెయిన్ విలన్ గా చేశారు.