ప్రముఖ టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ రియాల్టీ షోలోకి కేవలం ఫేమ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వారందరిని ఒకే గదిలో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి, వారిని ఆడిస్తారు. ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మధ్యలో ఒక ఓటీటీ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏడో సీజన్(Bigg Boss7) నిన్న రాత్రి మొదలు కాగా..అసలు ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు? వారి వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో బిగ్ బాస్ ఏడో సీజన్(Bigg Boss 7) ఆల్రెడీ మొదలైపోయింది. ఆదివారం రాత్రి 15 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ఆహ్వానించారు. ఏడో సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. షో ప్రారంభోత్సవంలో అతను నల్లటి సూట్లో అందంగా కనిపించాడు. ప్రతి సీజన్లో దాదాపు ఇరవై ఒక్క మంది ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం అంతా ఉల్టా పుల్టా అని మేకర్స్ నివేదించడంతో ఇంట్లో కేవలం 14 మంది సెలబ్రిటీలను మాత్రమే పరిచయం చేశారు. అలాగే వీరంతా హౌస్ మేట్స్ కాదు. కంటెస్టెంట్స్ అని నాగార్జున వెల్లడించారు. అంటే మిగిలిన వారిని దూరంగా ఉంచి హౌస్‌మేట్స్‌లో ఫైనల్ రౌండ్లు ఎవరన్నదానిపై పెద్దఎత్తున గొడవ జరుగుతుంది.
అలాగే నాగార్జున కంటెస్టెంట్లను వెంటనే హౌస్ నుంచి వెళ్లిపోవాలని వారికి పెద్ద డబ్బు ఆఫర్(money offer) చేసి ఆటపట్టించాడు. షో చివర్లో టాప్ 5కి ఇచ్చే మనీ ఆఫర్ ఫస్ట్ 5కే ఇచ్చారు. అది కూడా రూ.35లక్షలు ఇవ్వడం విశేషం. కానీ ఆ మొదటి ఐదుగురు దానిని రిజెక్ట్ చేశారు. ఈ సీజన్ డిఫరెంట్ గా ఉంటుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇక ఓటింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా పెట్టడం విశేషం.