»The Netizen Who Proposed To The Heroine Kajal Agarwal And Crazy Reply
Kajal aggarwal: హీరోయిన్ కు ప్రపోజ్ చేసిన నెటిజన్..క్రేజీ రిప్లై
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal aggarwal) తాజాగా బ్లూకలర్ డ్రైస్లో అందాల కనువిందు చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ ప్రపోజ్ చేయగా..ఈ అమ్మడు రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో చేసిన కాజల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో చాట్ చేసిన ఈ భామకు ఓ వ్యక్తి ప్రపోజ్ చేయగా..అందుకు అప్పుడు కూడా క్రేజీగా అన్సార్ చెప్పింది.
the netizen who proposed to the heroine kajal agarwal and crazy reply
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal aggarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా అందంగా ఉండే ఈ నటి.. సాంప్రదాయ చీరల్లోనే కాదు. ఏ స్టైల్ దుస్తులు ధరించినా కూడా అదిరిపోయే విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ అమ్మడు 2004లోనే బాలీవుడ్ మూవీ క్యూన్లో తొలిసారిగా నటించింది. వచ్చే ఏడాది నాటికి ఈ భామ సినిమాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తవుతుంది. సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదనే చెప్పవచ్చు.
ఆ క్రమంలోనే కొన్ని రోజులు సినిమాలకు(movies) బ్రేక్ ఇచ్చి అక్టోబర్ 30, 2020న అగర్వాల్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఆమె స్వస్థలమైన ముంబైలో సన్నిహితుల సమక్షంలో ఓ ప్రైవేట్ హోటల్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఏప్రిల్ 19, 2022న నీల్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. అయినప్పటికి తనకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా కాజల్ తన ఇన్ స్టా ఖాతాలో బ్లూ కలర్ షర్ట్ ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు సూపర్, వావ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి వావ్ మీరు చాలా అందంగా ఉన్నారు. మై డియర్ లవ్ అని కామెంట్ చేశారు. అందుకు కాజల్ లవ్ ఏమెజీలతో రిప్లై కూడా ఇచ్చింది.
అంతేకాదు 2019లో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అభిమానుల(fans)తో సరదాగా ముచ్చటించింది. అప్పుడు ఓ అభిమాని ఐ లవ్ యూ అని చెప్పి పెళ్లి చేసుకుందామని అన్నాడు. అందుకు ఈ భామ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కొంత ప్రయత్నం చేయాలి. కానీ అది అంత ఈజీగా జరగదు. చాలా స్టామినా ఉండాలని అన్నట్లుగా సమాధానం చెప్పింది. ఇక ఇది చూసిన నెటిజన్లు కాజల్ అగర్వాల్ సిగ్నల్ ఇచ్చిందా అని కామెంట్లు చేశారు.