Bedurulanka 2012′: ‘Dongode Doragadu’ Has Stimulating Message
Bedurulanka 2012: ఆర్ఎక్స్ 100 కార్తీకేయ నటిస్తోన్న తాజా చిత్రం బెదురులంక. చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. సినిమాలో ముగ్గురు కీలక పాత్రదారులను పాటలో పరిచయం చేశారు. ఆ ముగ్గురు ఒక్కో దేవుడి పేరు చెప్పుకొని ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అనే దానిని అందులో చూపించారు. దొంగోడే దొరగాడు అంటే సాగే పాట విభిన్నంగా ఉంది.
చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మణి సంగీతం అంటే పాటలు అదిరిపోతాయి. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ మ్ భావిస్తోంది.గతంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే పాట, ఆ పాట కూడా బాగానే క్లిక్ అయ్యింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయిక కావడం విశేషం.
ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామా ఫ్లస్ కామెడీ మూవీ అని తెలుస్తోంది.