Rajinikanth: ‘జైలర్’.. ఈ రెండు సినిమాల కాపీ అంటున్నారే!
గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ సారి భాషా రేంజ్ సినిమాతో రాబోతున్నానని.. జైలర్ ట్రైలర్‌తో చెప్పకనే చెప్పేశాడు. రిలీజ్ అయిన జైలర్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు మాత్రం ఈ సినిమా ఫలానా సినిమాలకు కాపీ అని అంటున్నారు.
Rajinikanth: రజినీకాంత్ నుంచి భాషా, నరసింహా, కబాలి రేంజ్ సినిమాలు రావాలని ఆశపడుతున్నారు అభిమానులు. అందుకే.. జైలర్ సినిమా ఆ లోటును పూడుస్తుందని తలైవా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ ఇదీ.. ఆగష్టు 10న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కోలీవుడ్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్కు తమన్నా తనదైన స్టైల్లో డ్యాన్స్ ఇరగదీసింది. కావాలయ్య సాంగ్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. వింటేజ్ రజనీ కాంత్‌ను ప్రజెంట్ చేస్తున్నట్టు ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ అయిన రజనీ కాంత్ కొడుకు కనిపించకుండా పోతాడు. దీంతో తన కొడుకు కోసం రజనీ ఏం చేశాడు? తన బ్యాగ్ గ్రౌండ్ ఎంటి? జైలర్‌గా తనకున్న అనుభవంతో మాఫియా ముఠాను ఎలా అంతం చేశాడు? అనేది కథ అంటూ ట్రైలర్లో చూపించాడు. రజనీకాంత్ ఏజ్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు.
ఈ స్టోరీ లైన్ రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాకు సింక్ అవుతోంది. అందుకే ‘జైలర్’ సినిమాను ‘విక్రమ్’ మూవీతో పోలుస్తున్నారు. 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘నోబడీ’లాగా ‘జైలర్’ ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో పోరాడుతాడు. అందుకే.. ఈ రెండు సినిమాలతో జైలర్ మూవీని పోలుస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ మామూలోడు కాదు. చివరగా చేసిన ‘బీస్ట్’ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన అతన్ని తక్కువ అంచనా వేయలేం. కాబట్టి.. అసలు కథేంటనేది తెలియాలంటే ‘జైలర్’ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.