తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు జయభారతి(77) అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో ‘కుడిసై’ సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ జీవితంలో కేవలం 9 సినిమాలకు దర్శకత్వం వహించారట.