బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గతేడాది అభిమానిని కొట్టడం వివాదంగా మారింది. షాట్ మధ్యలో అడ్డు రావడంతో నటుడు అసహనానికి గురై అభిమాని తలపై కొట్టారు. ఈ విషయంపై తాజాగా నానా పటేకర్ స్పందించారు. ‘తప్పు నాదే. అలా చేసి ఉండకూడదు. షాట్ మధ్య అతడు రావడం వల్ల నాకు కాస్త కోపం వచ్చింది. అభిమానులు ప్రేమను వ్యక్త పరచడానికి సమయం, సందర్భం చూసుకోవాలి’ అని అన్నారు.