TG: హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ఘటనపై ఓ వ్యక్తి NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. సిటీ పోలీస్ యాక్ట్ కింద.. ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లుఅర్జున్ రావడంతో.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.