రీసెంట్గా గాడ్ ఫాదర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు చిరు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఇటీవల దీపావళి కానుకగా విడుదలయిన టీజర్..
ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పకనే చెప్పేసింది. దాంతో మెగా154 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తుండడంతో.. అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే సీనియర్ హీరో వెంకటేష్ కూడా గెస్ట్ రోల్లో కనిపించనున్నాడని ప్రచారంలో ఉంది.
ఇక ఇప్పుడు మరో హీరో కూడా వాల్తేరు వీరయ్యలో స్పెషల్ రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో యంగ్ హీరో కార్తికేయ కనిపించబోతున్నాడని సమాచారం. కార్తికేయ పాత్ర నిడివి తక్కువ అయినా.. సినిమాలో కీలకం అని తెలుస్తోంది. అది కూడా పవర్ ఫుల్ పోలీస్ రోల్లో కనిపిస్తాడని.. ఈ క్యారెక్టరక్ ఎమోషనల్‌గా ఉంటుందని టాక్.
దాంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో.. శృతి హాసన్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ ఐటమ్ సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది.