చూసేదంతా నిజం కాదు.. వినేదంతా వాస్తవం కాదు.. కానీ లైగర్ టీమ్ మాత్రం ఇదే నిజమనుకుందనే సందేహం రాక మానదు. లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోట్ చేసింది పూరి టీమ్. ఎక్కడికెళ్లినా విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి షాక్ అయ్యారు. ఆ అభిమానం చూసి.. రౌడీ కూడా ఒక్కోసారి నమ్మలేకపోయాడు. ఇక లైగర్ హైప్ చూసి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనుకున్నారు. కానీ ప్రమోషన్స్ కోసం ఎగబడిన అభిమానులను థియేటర్‌కి రప్పించలేకపోయింది లైగర్. దాంతో లైగర్‌కు భారీ నష్టం తప్పలేదనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే లైగర్ మోజులో.. అందులో హీరోయిన్గా నటించిన అనన్య పాండే ఓ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకుందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడం పక్కా అని.. తెలుగులో గ్రాండ్‌గా ఎంట్రీ ఖాయమని గాల్లో తేలిపోయింది అనన్య. కానీ లైగర్ రిజల్ట్ అమ్మడి ఆశల్ని ఆవిరి చేసేసింది. అంతేకాదు ఎన్టీఆర్‌తో వచ్చిన గోల్డేన్ ఛాన్స్ మిస్ చేసుకునేలా చేసిందట. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో అనన్య పాండేను ఎన్టీఆర్ 30 టీమ్ సంప్రదించినట్టు టాక్. అయితే ‘లైగర్’ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పిందట అమ్మడు. కానీ లైగర్ చూసిన తర్వాత అనన్య హీరోయిన్ మెటీరియల్ కాదనే కామెంట్స్ వినిపించాయి. దాంతో ఎన్టీఆర్ 30 లిస్ట్‌లో ఈ బ్యూటీ పేరు ఎగిరిపోయినట్టు టాక్. దాంతో సీతారామంలో నటించిన మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందట. ఏదేమైనా లైగర్ భామకు లైగర్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.