దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే.. ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్క పెట్టాల్సిందే. అయితే జక్కన్న ఎవరితో ఏ సినిమా తీసినా.. ఎవరికి ఇంటర్యూలు ఇచ్చినా.. ఫైనల్గా మహాభారతం టాపిక్ రావాల్సిందే. ఎందుకంటే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే. తాజాగా దీనిపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి.
మహాభారతం(Mahabharatam) అనేది రాజమౌళి(Rajamouli) చివరి సినిమాగా రానుంది. అయితే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే విషయంలో.. జక్కన్నకే క్లారిటీ లేదు. ట్రిపుల్ ఆర్(RRR)తో ఆస్కార్ కొట్టేసిన రాజమౌళి.. నెక్స్ట్ మహేష్ బాబు(Maheshbabu) సినిమాను ఆస్కార్ టార్గెట్గా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు. వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత రాజమౌళి మరో మూడు, నాలుగు సినిమాలు చేయనున్నాడు. ఆ తర్వాతే డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఉండే ఛాన్స్ ఉంది. చాలా ఏళ్ల కిందటే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ను ప్రకటించాడు.
మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తీసినప్పటికీ.. ‘మహాభారతం’ చేయాలంటే అంతకుమించి విజువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నాడు జక్కన్న. కాబట్టి ఏ సినిమా చేసినా.. రాజమౌళి మహాభారతానికి ఓ ట్రయల్గానే చెప్పొచ్చు. తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు జక్కన్న. ఈ సినిమా తీస్తే పది భాగాలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళికి ‘మహాభారతం’ గురించి ప్రస్తావన వచ్చింది.
టీవీలో ఆ కథను 260కి పైగా ఎపిసోడ్లుగా తీశారని.. మరి సినిమాగా అది ఎన్ని భాగాలుగా ఉంటుందని రాజమౌళికి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి జక్కన్న ‘మహాభారతం చదవడానికే ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఆ సినిమా తీస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనా’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో నాలుగైదు భాగాలు ఉంటుందని హింట్ ఇచ్చాడు రాజమౌళి. కానీ ఇప్పుడు.. ఏకంగా పది పార్ట్స్ అనేసరికి.. ఈ సినిమా ఇప్పట్లో ఉంటుందా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్లు తీసుకునే రాజమౌళి.. చివరగా మహాభారతం సినిమాకే అంకితం అయిపోవాల్సిందే!