ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్నాడు. బాహుబలి తర్వాత పలు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ప్రభాస్.. శ్రీరాముడిగా 'ఆదిపురుష్' సినిమా కూడా చేశాడు. దీంతో ప్రభాస్‌కు అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనున్న సంగతి తెలిసిందే. గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులతో పాటు.. దేశంలో భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులను హాజరు కాబోతున్నారు.
ఇప్పటికే ఈ వేడుక కోసం పలువురు సినీ ప్రముఖులను అయోధ్యకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. రణబీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్‌లతో పాటు తెలుగు నుంచి చిరంజీవీకి పిలుపు వచ్చిందని వార్తలొచ్చాయి. అలాగే.. రజినీకాంత్, మోహన్‌లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుష్, రిషభ్ శెట్టి, అమితాబ్ బచ్చన్, సన్నీ డియోల్, అజయ్ దేవ్గన్, ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్‌కుమార్ హిరానీ యష్ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామజన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించారు. ఇక ఇప్పుడు ప్రభాస్‌ను సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించాడు ప్రభాస్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక.. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడే సాధువులు మరియు VVIPలతో సహా సుమారు 6000 మంది ప్రముఖుల జాబితాను ట్రస్ట్ ఈ నెల మొదట్లోనే ఖరారు చేశారు. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి. జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.