టాలీవుడ్ డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్-సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు పుష్పరాజ్ నటనకు ఫిదా అయిపోయారు. దాంతో పుష్ప మూవీకి బ్రహ్మరథం పట్టారు. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు లెక్కల మాస్టారు. మేకర్స్ కూడా పుష్ప మూవీ వసూళ్లు చేసిన బడ్జెట్ అంటే.. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింంచేదుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గతేడాది డిసెంబర్ 17 రిలీజ్ అయింది పుష్ప.
అయినా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ ఎట్టకేలకు ఇటీవలె పూజా కార్యక్రమాలు జరుపుకుంది పుష్ప2. దాంతో అతి త్వరలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అక్టోబర్ 1న అల్లు స్టూడియోలో షూట్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేథ్యంలో ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘పుష్ప.. ది రూల్’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న పుష్ప.. కేవలం 6,7 నెలల్లో షూటింగ్ జరుపుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందా.. అనే సందేహాలొస్తున్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్ వన్‌లో గ్రాఫిక్స్ పరంగా విమర్శలొచ్చాయి. దాంతో సుకుమార్ మరోసారి అది రిపీట్ కాకుండా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి సమ్మర్లో పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సమయంలోనే.. అంటే 2023 చివర్లో.. సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశలే ఎక్కువగా ఉన్నాయి. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న పుష్ప2కు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.