ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్‌తో మంగళ వారం సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత.. ఖచ్చితంగా మంగళవారం సాలిడ్ కంటెంట్‌తో రాబోతోందని ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
‘మంగళ వారం(Mangalavaram)’ అనే టైటిల్‌తోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి. కానీ ఆర్ఎక్స్100 తర్వాత చేసిన మహాసముద్రం సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు అజయ్. అందుకే.. మంగళ వారం అనే డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బయటికి వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ అదిరిపోయాయి. ఈ మూవీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయగా.. సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు మంగళ వారం ఏ జరగబోతోంది? అనేది థియేటర్లోనే చూడాలి అంటున్నారు మేకర్స్.
హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(payal rajput) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ రానుంది. ఇక విడుదల టైం దగ్గరపడుతుండడంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో మంగళ వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గెస్ట్‌గా రానున్నాడని తెలుస్తోంది. దీనిపై అఫిషీయల్ కన్ఫర్మేషన్ ఒక్కటే పెండింగ్ అని అంటున్నారు. ఒకవేళ బన్నీ ఈ ఈవెంట్‌కు వస్తే సినిమా పై మరింత హైప్ రావడం గ్యారెంటీ. ఇప్పటికే మంగళ వారంపై మంచి బజ్ ఉంది. అలాంటి సినిమాను అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ ప్రమోట్ చేస్తే..ఆ హైప్ మామూలుగా ఉండదు. మరి మంగళవారం ఎలా ఉంటుందో చూడాలి.