టాలీవుడ్(Tollywood) హీరో అల్లరి నరేష్(Allari Naresh) వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఉగ్రం సినిమా(Ugram Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో నాంది సినిమా(Naandi Movie) చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala)తోనే ఇప్పుడు ఉగ్రం సినిమా చేస్తున్నాడు.
ఉగ్రం సినిమా ట్రైలర్:
తాజాగా ఉగ్రం సినిమా(Ugram Movie)కు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల(Release) చేసింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్(Allari Naresh) కనిపించనున్నాడు. సిటీలో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతూ ఉండటంతో ఆ రాకెట్ వెనుక ఎవరున్నారనే దానిపై కథ నడుస్తుంది. బలమైన హీరోయిజం, ఎమోషనల్ సీన్స్ ను కట్ చేసి ట్రైలర్(Trailer)గా వదిలారు.
ఉగ్రం సినిమా(Ugram Movie)లో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని గతంలోనే అల్లరి నరేష్(Allari naresh) చెప్పాడు. టైటిల్ తగ్గ బాడీ లాంగ్వేజ్ ను ఈ సినిమా చూపించానని, ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన నిజస్వరూపం చూస్తారని అల్లరి నరేష్ తెలిపాడు. ఈ మూవీలో ఇంద్రజ(Indraja) కీలక పాత్రలో కనిపించనున్నారు. మే 5వ తేదిన ఈ సినిమా విడుదల కానుంది.