Alia Bhatt : ఆ హీరోయిన్‌కి అలియాభట్ చేతబడి చేయించిందా ?
అలియా భట్(Alia Bhatt).. రణబీర్ కపూర్(Ranbir Kapoor)ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె తన బిడ్డతో మాతృత్వపు మధురిమలను అనుభవిస్తుంది. కానీ ఇటీవల ఆమె గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాను తన తల్లి కలిసి ఒక హీరోయిన్(heroine)కు చేతబడి చేయించారన్న వార్తలు గుప్పు మంటున్నాయి.
Alia Bhatt : అలియా భట్(Alia Bhatt).. రణబీర్ కపూర్(Ranbir Kapoor)ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె తన బిడ్డతో మాతృత్వపు మధురిమలను అనుభవిస్తుంది. కానీ ఇటీవల ఆమె గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాను తన తల్లి కలిసి ఒక హీరోయిన్(heroine)కు చేతబడి చేయించారన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఉమైర్ సందు(Umair Sandu) ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువ గా వినిపిస్తుంది. తాను దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ని అని చెప్పుకుంటున్నారు. తానొక సినిమా క్రిటిక్నని కూడా చెబుతున్న ఉమైర్ బాలీవుడ్(Bollywood) ప్రముఖులపై అడపాదడపా కాంట్రవర్షల్ ట్వీట్స్ చేస్తున్నాడు. తాజాగా ఈ కాంట్రవర్షల్ స్టార్ అలియా భట్, దీపికా పదుకొణే(Deepika Padukone)ల గురించి పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.
“దీపికా పదుకొణే, కత్రినా కైఫ్‌లతో కలిసి పనిచేయకూడదని రణబీర్ కపూర్‌ని అలియా భట్ హెచ్చరించింది. అలియా భట్ దీపికా కెరీర్ ఇంటర్నేషనల్ ఖ్యాతి పట్ల ఆమెకున్న అసూయ కారణంగా ఇలా చేసింది. అంతేకాదు, అలియా భట్, ఆమె తల్లి సోనీ రజ్దాన్ దీపికపై చేతబడి చేశారు. ఫలితంగా ఆమె అనారోగ్యానికి గురైంది.” అని ఉమైర్ ఆరోపించాడు. అలియా భట్.. పాపులర్ కావాలనే తపనతోనే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పీఆర్ వాళ్లతో పడుకుందని కూడా ఈ క్రిటిక్ కామెంట్లు చేయడం ఇప్పుడు షాకిస్తోంది. ఇక సినీ విమర్శకుడు అనన్య పాండేపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనన్య ఒక సెక్స్ అడిక్ట్ అని, ఆమె ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి డే అండ్ నైట్ గడుపుతోందని ఉమైర్ సందు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇక పరిణితి చోప్రా సినీ జీవితాన్ని కూడా అలియాభట్ నాశనం చేసిందని.. కరణ్ జోహార్(Karan Johar) హెల్ప్ కూడా తీసుకుందని సదరు క్రిటిక్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ట్వీట్స్ పై బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తారా లేదో చూడాలి.