కోలీవుడ్లో అభిమానుల మధ్య వార్ ఊహించని విధంగా ఉంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. తిట్లతోనే సరిపెడుతున్నారు.
కానీ అది అంతకు మించి అన్నట్లుగా తయారైంది. వీళ్ల దెబ్బకు సోషల్ మీడియా సైతం హడలెత్తిపోతోంది. ఇప్పుడు మరోసారి అలాంటి భయంకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. వచ్చే సంక్రాంతికి విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘తునివు’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఇప్పటికే సోషల్ మీడియాలో నువ్వా నేనా అనే హడావుడి మొదలైపోయింది.
ప్రతి విషయంలోను మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటున్నారు. ఏదో ఒక విషయంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటునే ఉన్నారు. వాళ్లను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి. అందుకే స్వయంగా హీరోలే రంగంలోకి దిగుతున్నారు. గతంలో తమ అభిమానులను వారించిన అజిత్, విజయ్.. ఈ సారి కూడా అలాగే చేయబోతున్నారు. తాజాగా అజిత్ తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ గురించి నేరుగా ప్రస్తావించకుండా..
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అజిత్. ‘మనం బతుకుదాం, వేరేవాళ్లను బతికిద్దాం.. డ్రామా వద్దు, నెగెటివిటీ వద్దు.. మీ చుట్టూ మిమ్మల్ని ప్రోత్సహించే వారినే పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయండి.. అంటూ సందేశం ఇచ్చాడు అజిత్. దాంతో ఖచ్చితంగా ఇరువురు అభిమనులను ఉద్దేశించే అజిత్.. ఇలా అన్నాడని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ తగ్గుతారేమో చూడాలి.