ఆదిపురుష్ దెబ్బకు ప్రభాస్ మిగతా సినిమాలతో పాటు.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పై కూడా ఎఫెక్ట్ పడనుందని తెలుస్తోంది. రీసెంట్గా గ్రాఫిక్స్ కోసం ఇంకొంత సమయం కావాలంటూ.. ఆదిపురుష్ను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు ఓం రౌత్. సంక్రాంతి నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు.
ఇక ఆదిపురుష్ను వాయిదా వేయడంతో.. ప్రశాంత్ నీల్-ప్రభాస్ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. సలార్ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ప్రశాంత్ నీల్. అందుకు తగ్గట్టే షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆదిపురుష్ వల్ల ఇప్పుడది సాద్యమయ్యేలా లేదు. దాంతో మరోసారి సలార్ సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అటు కొరటాల ప్రాజెక్ట్.. ఇటు సలార్ తర్వాత.. ఎన్టీఆర్ 31ని సమ్మర్లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించాడు ప్రశాంత్ నీల్. ఈలోపు సలార్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ ఆదిపురుష్ దెబ్బకు ఎన్టీఆర్ 31 అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అంటున్నారు. పైగా కొరటాల ప్రాజెక్ట్ కూడా ఇంకా మొదలు కాలేదు. దాంతో ఎన్టీఆర్ 31 ప్లాన్ మారినట్టేనని చెప్పొచ్చు. మొత్తంగా ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. ప్రశాంత్ నీల్ పై గట్టిగానే పడనుందని అంటున్నారు.