బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు జైలు శిక్ష పడింది. ఈ కేసుపై విచారణ జరిపిన కర్ణాటక కోర్టు.. ఆమెతో పాటు మరో ఇద్దరు నిందితులు తరుణ్ కొండూరు రాజు, సాహిల్ జైన్లకు ఏడాది జైలు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది. అక్రమ రవాణాకు తగిన ఆధారాలు ఉన్నందున ఈ శిక్ష కాలంలో వారికి బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే హక్కును నిరాకరించింది.