»Actress Doctor Priya Who Was 8 Months Pregnant Died Of A Heart Attack
Actress died: గర్భవతి అయిన నటి డాక్టర్ చెకప్‌కు వెళ్లి మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియ 35 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మృత్యువాత చెందారు. అయితే ఆమె మరణించిన సమయంలో 8 నెలల గర్భవతిగా ఉండటం పలువురిని కలచివేస్తుంది.
Actress Doctor Priya who was 8 months pregnant died of a heart attack
నటి రెంజూషా మీనన్ విషాద మరణం తర్వాత, మలయాళ పరిశ్రమలో మరో ఘోరం చోటుచేసుకుంది. పలు టీవీ సీరియల్స్‌లో పనిచేసిన నటి డాక్టర్ ప్రియ కన్నుమూశారు. ఆమె గుండెపోటు కారణంగా మరణించింది. ఆమె 35 ఏళ్ల వయసులో ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇలా జరగడం పలువురిని కలచివేస్తుంది. గుండెపోటుకు గురైన ఈ నటి సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. తన నవజాత శిశువు ఇప్పుడు ICU లో ఉండగా ఆమె మరణించింది. అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే నటికి ఇంతకు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు కూడా కావడం విశేషం. అనేక టీవీ షోలలో కనిపించే నటుడు కిషోర్ సత్య, డాక్టర్ ప్రియ మరణించిన వార్తలను ధృవీకరించారు. ఈ విషయాన్ని కిషోర్ సత్య తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
రెండు రోజుల క్రితమే నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మలయాళ పరిశ్రమలో చాలా పేరున్న నటి. ఆమెకు భర్త, తల్లి, తండ్రి ఉన్నారు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రియ మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. విధి తన పట్ల క్రూరత్వాన్ని చూపించిందని రాస్తున్నారు. డైనమిక్ వ్యక్తులకు ఇటువంటి దురదృష్టకర పరిస్థితులు ఎలా వస్తున్నాయని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. COVID-19 తర్వాత గుండెపోటు వ్యాధులు రావడం పెరిగిందని ఇంకొంత మంది అంటున్నారు. దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నామని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.