»Sania Mirza Shoaib Malik Son Izhaan Mentally Disturbed
Sania Mirza : తండ్రి మూడో పెళ్లితో తన కొడుక్కీ మనసిక క్షోభే అంటున్న సానియా!
తండ్రి మూడో వివాహం చేసుకోవడంతో తన కుమారుడు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని, పాఠశాల నుంచీ వేధింపులను ఎదుర్కొంటున్నాడని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు.
టెన్నిస్ క్రీడాకారికి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై సానియా మీర్జా ఓ పాకిస్థానీ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్య్వూలో కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ విషయంలో తాను డిస్ట్రబ్ కావడమే కాకుండా తన కుమారుడు ఇహాన్ సైతం డిస్ట్రబ్ అయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇహాన్ పాఠశాల నుంచీ వేధింపులను ఎదుర్కొన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇహాన్ మానసిక క్షోభకు గురయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు.
మూడు నెలల క్రితం సానియా మీర్జా(Sania Mirza)తో షోయబ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై గతంలో సానియా కూడా పరోక్షంగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు చేశారు. తర్వాత వీరి విడాకుల వార్తను సానియా తండ్రి కన్ఫమ్ చేశారు. సంప్రదాయం ప్రకారం సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ రెండు వారాల క్రితం పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మూడవ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరి పెళ్లి వార్త అందర్నీ షాక్‌కి గురి చేసింది.
ఇక సానియా, షోయబ్‌లకు ఏప్రిల్ 12, 2010 లో పెళ్లైంది. కెరియర్లో బిజీగా ఉన్న ఇద్దరికి వివాహమైన 8 సంవత్సరాల తర్వాత 2018 లో ఇహాన్ జన్మించాడు. ఇహాన్ పుట్టాక సానియా టెన్నిస్‌కు విరామం తీసుకున్నారు. కాగా ఇప్పుడు షోయబ్ పెళ్లి విషయంలో తానే కాకుండా తన కొడుకు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నాడంటూ సానియా చెప్పుకొచ్చారు.