Jr.NTR : ఆది రీ రిలీజ్ ఫిక్స్.. మరి సింహాద్రి ఔటా!?
Jr.NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్‌తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం కొత్త సినిమాల కంటే.. హిట్ సినిమా రీ రిలీజులే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ తాజాగా ఆరెంజ్ వరకు కొనసాగుతునే ఉంది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈ కల్ట్ క్లాసిక్‌ని రీ రిలీజ్ చేస్తే.. ఏకంగా మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 6న దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఒకటి కాదు రెండు సినిమాలతో మాస్ జాతర చేయించడానికి వస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆది, సింహాద్రి సినిమాలను.. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2002లో వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఆది సినిమాను.. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఎన్టీఆర్‌కు భారీ మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది ఆది సినిమా. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రితో.. టాలీవుడ్లో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా జెండా పాతేశాడు యంగ్ టైగర్. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నట్టు వినిపిస్తోంది. అయితే ముందుగా ఆది డేట్ ఫిక్స్ చేసేశారు కాబట్టి.. సింహాద్రి రీ రిలీజ్ ఉంటుందా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. రెండు సినిమాలు రిలీజ్ అయితే మాత్రం.. ఈ ఏడాదిలో తారక్‌ను బిగ్ స్క్రీన్ పై చూసి.. పండగ చేసుకుంటారు అభిమానులు. మరి ఆదితో పాటే సింహాద్రి కూడా రీ రిలీజ్ అయి.. ఎలాంటి వసూళ్లు రాబడతాయే చూడాలి.