పుష్ప-2 సినిమాలో హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో ఎస్పీ షెకావత్ విఫలమైనా నిజ జీవితంలో ఓ పోలీస్ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఆయన ఎవరు అంటూ నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ పోలీస్ పేరు బానోత్ రాజు నాయక్. ఆశ్చర్యమైన అంశం ఏంటంటే.. ఆయన బన్నీకి వీరాభిమాని. ఒక్కసారైనా అతడితో ఫొటో దిగాలని భావించాడట. కానీ చివరికి అభిమాన హీరోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వైరల్గా మారడం విశేషం.