సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేళ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘భద్రతా పరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే వాళ్లు చుట్టు పక్కల వారికి సూచిస్తుంటారు. ఏదైతే జరిగిందో అది బాధాకరమైన విషయం. ఒక వ్యక్తినే నిందించడం దురదృష్టకరం’ అని పేర్కొన్నాడు. ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో భాగంగా జైపుర్‌లో వరుణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.