హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఓ కార్యక్రమానికి పాల్గొనడానికి గురువారం వచ్చిన ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. మీరు కథ సిద్ధం చేస్తే చేస్తానని బదులిచ్చారు. ఊహించనిది చేయడమే తన నైజమని బాలయ్య చెప్పారు.