15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేశ్ సిద్ధమవుతున్నారు. కాగా, తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్, ఆమె హిందూ కాబట్టి.. రెండు మతాలను గౌరవిస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 12న గోవాలో జరగనుంది. ఉదయం హిందూ మత సంప్రదాయం ప్రకారం.. అదే రోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోనున్నారు.