తమిళ హీరో అజిత్ కుమార్, దర్శకుడు తిరుమేని కాంబోలో తెరకెక్కిన సినిమా ‘విడాముయార్చి’. తాజాగా అజిత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, రెజీనా సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.