అల్లు అర్జున్ అరెస్టుపై హైకోర్టులో విచారణ 4 గంటలకు వాయిదా పడింది. ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి నాలుగు గంటలకు వివరిస్తానని చెప్పారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు 4 గంటలకు వాయిదా వేసింది.