పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ ఘుమాన్ కన్నుమూశారు. అమృత్‌సర్‌లోని ఆసుపత్రిలో వరీందర్‌కు సర్జరీ జరుగుతుండగా.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరీందర్ ‘టైగర్ 3’ సినిమాలో నటించారు.