ఈ సంక్రాంతికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. పండగకు ముందుగానే కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, దళపతి విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానున్నాయి. శివకార్తికేయన్ ‘పరాశక్తి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్‌సిరీస్ సీజన్ 2 జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.