ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అప్రమత్తమయ్యారు. ‘విశ్వంభర’ షూటింగ్‌ను రద్దు చేసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఇటీవల కాలంలో మెగా, అల్లు ఫ్యాన్స్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో చిరంజీవి.. బన్నీని కలిసేందుకు వెళ్లడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.