సినిమాల్లో మద్యం, డ్రగ్స్‌పై పాటలు ఉండటంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. మూవీల్లో ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించిందని, ఇలాంటి విషయాలపై చిత్రబృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ.. ఆయనకు తన పూర్తి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు.