శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే అమరన్ మూవీ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.