తెలంగాణలో మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. రెంటల్ విధానం వల్ల నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ (షేర్) పద్ధతిని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీ విడుదలపై 8 వారాల లాక్-ఇన్ పీరియడ్, విద్యుత్ సబ్సిడీలను కోరుతున్నారు. ఏప్రిల్ 30లోగా పరిష్కారం లభించని పక్షంలో 450 థియేటర్లు మూతపడుతాయని చెప్పారు.