విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ చేయనున్న సినిమాకు ‘బెగ్గర్’ టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఓ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని అన్నాడు. పూరితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, జూన్ నుంచి దీని షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపాడు.