మరో గంటలో చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల కానున్నారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆ ఆర్డర్ కాపీ తమకు అందలేదంటూ ఆయనను జైలు అధికారులు రాత్రంతా జైలులోనే ఉంచారు. అర్థరాత్రి సమయంలో ఐకాన్ స్టార్ తరఫు లాయర్లు ఆ ఆర్డర్ కాపీని అధికారులకు అందించారు. దీంతో ఇవాళ ఉదయం 7 గంటలకు ఐకాన్ స్టార్ జైలు నుంచి విడుదల కానున్నారు.