TG: సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. దీంతో భారీ సినిమాలకు దెబ్బ పడనుంది. అయితే, ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.