»10 Thousand Tickets For Aadipurush Movie Are Free
Adipurush: ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్ ఫ్రీ
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆదిపురుష్ సినిమా(Adipurush Movie) వరల్డ్ వైడ్‌గా భారీ స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. జూన్ 16న ఈ మూవీ బ్రహ్మాండంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్(Trailers), పోస్టర్స్ విడుదలయ్యాయి. నిన్న తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) వేడుక ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకు తిరుగులేని హైప్‌ను క్రియేట్ చేసింది. మరో తొమ్మిది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను చూసేందుకు ప్రతి సినీ ప్రేమికుడు అమితాసక్తితో ఎదురుచూస్తున్నాడు.
అభిషేక్ అగర్వాల్ చేసిన ట్వీట్:
Come, lets immerse in a divine cinematic experience with #Adipurush 🙏🏻
10,000+ tickets would be given to all the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by Mr. @AbhishekOfficl
తాజాగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ వేదికగా అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) స్పందిస్తూ..జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తిని స్మరించుకుందామని, మర్యాద పురుషోత్తముని స్మరించుకుందామని అన్నారు. ఆదిపురుష్(Adipurush Movie) వేడుకలు జరుపుకుందామని, శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం అని, ప్రతి తరం దాని గురించి తెలుసుకోవాలని, మునుపెన్నడూ లేని అనుభూతితో మునిగిపోదామని ఓ నోట్ ను రిలీజ్ చేశారు. ఈ ఫ్రీ టికెట్స్ పొందేందుకు ఓ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నెటిజన్లు, సినీ అభిమానులు అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal)పై ప్రశంసలు కురిపిస్తున్నారు.