టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు కాబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆంథోనీ అట్చిని పెళ్లి చేసుకోనుంది. తొలుత ఫ్రెండ్స్ అయిన వీరు.. తర్వాత ప్రేమలో పడ్డారు. తాజాగా పెద్దల అంగీకారంతో పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. ఈనెల 12న వీరి వివాహం వైభవంగా జరగనుంది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడుకకు కొంతమంది అతిథులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది.