నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ‘ప్యారడైజ్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ అండ్ షెడ్యూల్ సమస్యల కారణంగా సినిమా షూటింగ్ మార్చి చివరి వరకు కొనసాగుతోందని, అందుకే సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.