హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప -2 నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ పలు రికార్డులను సృష్టిస్తుంది. ‘బుక్ మై షో’లో ఒక గంటలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ప్రచార చిత్రాలు, పాటలు, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పింది.