చలికాలం వచ్చిందంటే చాలు, చర్మం పొడిబారి, పగుళ్లు రావడం సహజం. చర్మం తగినంత తేమగా లేకపోతే ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి.
నీరు
రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి.
స్నానం
చలిగా ఉంది కదా! అని స్నానం చేయడం మానకూడదు. స్నానంతో మృత చర్మకణాలు వదిలి చర్మం మెరుగవుతుంది.
స్నానానికి మరీ చల్లని లేదా మరీ వేడి నీళ్లు వాడకూడదు.
స్నానం చేసిన వెంటనే తడిపొడి చర్మం మీదే మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజింగ్ సబ్బులే వాడండి.
చిట్కాలు
గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలిపి ముఖం, చేతులు మీద పూసుకుని ఆరిన తర్వాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది.
బొప్పాయి, అరటి గుజ్జులతో ముఖం మర్దనా చేసుకున్నా చర్మం తేమగా మారుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి.
కెఫిన్, ఆల్కహాల్ వంటివి తగ్గించండి.
ధూమపానం మానుకోండి.
శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించండి.
ఈ చిట్కాలు పాటిస్తే మీ చర్మం ఈ చలికాలంలో కూడా తేమగా, మృదువుగా ఉంటుంది.